టాలీవుడ్ దీపావళి స్పెషల్

Wednesday,November 07,2018 - 10:45 by Z_CLU

టాలీవుడ్ కు దీపావళి కళ వచ్చేసింది. ఎన్నో సినిమాలు స్పెషల్ లుక్స్ విడుదల చేస్తే, మరెన్నో సినిమాలు సరికొత్త ఎనౌన్స్ మెంట్స్ తో సందడి చేశాయి. ఆల్రెడీ థియేటర్లలో ఉన్న అరవింద సమేత నుంచి త్వరలోనే రాబోయే ఎన్నో క్రేజీ ప్రాజెక్టులు దీపావళికి సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకొచ్చాయి

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ అరవింద సమేత సక్సెస్ ఫుల్ గా నాలుగో వారంలోకి ఎంటరైంది. దసరాకు విడుదలైన ఈ సినిమా, దీపావళి సీజన్ లో కూడా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.

దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ టాక్సీవాలా సినిమా నుంచి మరో బ్రాండ్ న్యూ పోస్టర్ విడుదల చేశారు. పనిలోపనిగా మరో హాట్ న్యూస్ కూడా రివీల్ చేశారు. అదేంటంటే.. ఈ సినిమా ట్రయిలర్ ను రేపు రిలీజ్ చేయబోతున్నారు.

దీపావళి కానుకగా ఎఫ్-2 యూనిట్ నుంచి మరో బ్రాండ్ న్యూ పోస్టర్ వచ్చేసింది. వెంకీ, వరుణ్ తేజ్ మాస్ లుక్స్ తో వచ్చిన ఈ పోస్టర్ తో అటు దగ్గుబాటి ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఎఫ్-2లో లుంగీ కట్టి మాస్ లుక్ లో కనిపించిన వరుణ్, అంతరిక్షం సినిమాలో మాత్రం పక్కా ట్రెడిషనల్ గా ముస్తాబయ్యాడు. హీరోయిన్ లావణ్యతో కలిసి ఎక్స్ క్లూజివ్ గా ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు అందిస్తున్నాడు.

ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్ లుక్స్ అన్నీ ఒకెత్తయితే, దీపావళి కానుకగా విడుదల చేసిన పోస్టర్ ఒక్కటి మరో ఎత్తు. గుండమ్మకథ సినిమాలోని ఎన్టీఆర్, సావిత్రి పాత్రలను పరిచయం చేస్తూ.. బాలయ్య, నిత్యామీనన్ పోస్టర్ ను దీపావళి కానుకగా విడుదల చేశారు.

అజయ్ హీరోగా స్పెషల్ అనే మూవీ తెరకెక్కుతోంది. అజయ్ కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ లోనే ఇదొక స్పెషల్ మూవీ అంటోంది యూనిట్. ఫాంటసీని సరికొత్త కోణంలో చూపిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాకు వాస్తవ్ దర్శకుడు. దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

విడుదలకు సిద్ధమైన అమర్ అక్బర్ ఆంటోనీ కూడా దీపావళికి సందడి చేసింది. రవితేజ లుక్ తో సరికొత్త పోస్టర్ విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను 16న విడుదల చేస్తున్నారు.  

ప్రతాప్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా అనగనగా ఓ ప్రేమకథ. టైటిల్ కు తగ్గట్టే బ్యూటిఫుల్ పోస్టర్ ను దీపావళి కానుకగా విడుదల చేశారు. నూతన నటీనటులు, నిర్మాతలు ఈ సినిమాతో పరిచయమౌతున్నారు.

“మళ్ళీరావా” సినిమా తరువాత నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న రెండో చిత్రం “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”. నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాతో స్వరూప్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

దీపావళి సందర్భంగా 24 కిస్సెస్ సినిమా నుంచి మరో బ్రాండ్ న్యూ పోస్టర్ విడుదల చేశారు. టైటిల్ కు తగ్గట్టు ఇప్పటికే కొన్ని లిప్ కిస్సుల్ని విడుదల చేసిన యూనిట్, ఈరోజు మరో హాట్ లిప్ కిస్ ను రిలీజ్ చేసింది. అదిత్, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు అయోధ్యకుమార్ దర్శకుడు.