టాలీవుడ్ బెస్ట్ క్యారెక్టర్స్ – 2017

Thursday,December 28,2017 - 12:41 by Z_CLU

కొన్ని సినిమాలతో హీరోలకు ఎంత గుర్తింపు వస్తుందో, అందులో మంచి పాత్ర పోషించిన క్యారెక్టర్ ఆర్టిస్టుకు కూడా అంతే క్రేజ్ వస్తుంది. అది సైడ్ క్యారెక్టర్ కావొచ్చు, ప్రతినాయకుడి పాత్ర కావొచ్చు… సినిమా పేరు చెప్పగానే హీరో తర్వాత వెంటనే గుర్తొచ్చే క్యారెక్టర్లవి. అలా 2017లో ప్రేక్షకుల్ని అలరించిన ది బెస్ట్ క్యారెక్టర్స్ చూద్దాం

 

కట్టప్ప  (బాహుబలి)

కట్టప్ప.. ఈ ఒక్క పేరు చెబితే చాలు ఠక్కున బాహుబలి పేరు గుర్తొస్తుంది. ఆ సినిమాలో కట్టప్ప పాత్ర అంతలా క్లిక్ అయింది. సినిమాలో ఈ కీలకమైన పాత్రను సత్యరాజ్ పోషించారు. తెలుగులో సత్యరాజ్ ఎన్ని సినిమాలు చేస్తున్నప్పటికీ.. అతడ్ని చూడగానే టాలీవుడ్ ఆడియన్స్ కు గుర్తొచ్చే పేరు కట్టప్ప.

 

ఆది (నిన్ను కోరి)

సరైనోడు సినిమాలో భయంకరమైన విలన్ గా కనిపించాడు ఆది. అలాంటి నటుడ్ని పెట్టి ఓ ఎమోషనల్ క్యారెక్టర్ పండించడం సాధ్యమా. నిన్ను కోరి సినిమా చూస్తే ఆ విషయం అర్థమౌతుంది. ఆ సినిమాలో నాని తర్వాత అందరికీ గుర్తుండిపోయే పాత్ర ఆది పోషించిన అరుణ్ పాత్ర.

 

అదిత్ (గరుడవేగ)

చాన్నాళ్ల గ్యాప్ తర్వాత రాజశేఖర్ కు సక్సెస్ చూపించిన సినిమా గరుడవేగ. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు అదిత్. సెకెండాఫ్ మొత్తం రాజశేఖర్, అదిత్ మాత్రమే ఎక్కువసేపు కనిపిస్తారు. అలాంటి కీలకమైన పాత్రను అద్భుతంగా రక్తికట్టింది అందరితో శభాష్ అనిపించుకున్నాడు ఈ కుర్ర హీరో.

 

అర్జున్ (లై)

సీనియర్ హీరో అర్జున్ కు ప్రయోగాలు చేయడం ఇష్టం. సరైన క్యారెక్టర్ దొరికితే అర్జున్ లో టాలెంట్ ఆటోమేటిగ్గా బయటకొస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ లై సినిమా. నితిన్ హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో విలన్ పద్మనాభం క్యారెక్టర్ లో కనిపించాడు అర్జున్. ఎప్పటికప్పుడు వేషాలు మార్చే పాత్రలో అర్జున్ యాక్టింగ్ సూపర్బ్.

 

భూమిక (ఎంసీఏ)

ఒకప్పటి హీరోయిన్, మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఎంసీఏ సినిమాతో అదరగొట్టింది. నానికి వదినగా నూటికి నూరు మార్కులు కొట్టేసింది భూమిక. అలా హీరోయిన్ పాత్రల నుంచి క్యారెక్టర్ రోల్స్ కు షిఫ్ట్ అయింది ఈ మాజీ హీరోయిన్. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన ఆడిపాడిన ఈ నటి, ఇప్పుడు మంచి క్యారెక్టర్ రోల్స్ చేసేందుకు రెడీ అంటోంది. ఎంసీఏలో నాని తర్వాత అందరికీ గుర్తొచ్చే పాత్ర భూమికదే.

బ్రహ్మాజీ (నెక్ట్స్ నువ్వే)

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది నెక్ట్స్ నువ్వే మూవీ. ఆది హీరోగా నటించిన ఈ సినిమాలో ఆది తర్వాత అంతగా క్లిక్ అయిన క్యారెక్టర్ బ్రహ్మాజీ. ఈ సినిమాలో బ్రహ్మాజీ చేసిన కామెడీ టోటల్ సినిమాకే హైలెట్. సినిమాలో ఎంతమంది నటులున్నా.. బ్రహ్మాజీ పాత్రే బాగా ఎలివేట్ అయింది.

 

హేమమాలిని (గౌతమీపుత్ర శాతకర్ణి)

బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో కీలకమైన తల్లిపాత్ర పోషించారు హేమమాలిని. ఎన్నో దశాబ్దాల తర్వాత ఓ తెలుగు సినిమాలో నటించిన హేమమాలిని, టాలీవుడ్ స్క్రీన్ పై తనదైన ముద్ర వేశారు. గంభీరమైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. 2017 బెస్ట్ క్యారెక్టర్స్ లో హేమమాలిని పోషించిన గౌతమీ రోల్ కూడా అందరికీ గుర్తుండిపోతుంది.

 

నవీన్ చంద్ర (నేను లోకల్)

హీరో క్యారెక్టర్ పండాలంటే విలన్ బలంగా ఉండాలంటారు. కానీ విలన్ ఛాయల్లో కూడా వేరియేషన్ చూపించాడు నవీన్ చంద్ర. నిజానికి నేను లోకల్ సినిమాల నవీన్ చంద్ర విలన్ కాదు. కేవలం కొన్ని సందర్భాల్లో అలా కనిపిస్తాడంటే. అతడి గెటప్, యాక్టింగ్ నేను లోకల్ సినిమాకు బాగా ప్లస్ అయింది. నవీన్ చంద్ర కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్ గా నిలిచిపోతుంది నేను లోకల్ లోని సిద్దార్థ్ వర్మ పాత్ర.

 

రమ్యకృష్ణ, జగపతిబాబు (హలో)

సీనియర్ ఆర్టిస్టులకు మంచి పాత్రలు పడితే ఎలా ఉంటుందో హలో సినిమాలో రమ్యకృష్ణ, జగపతిబాబును చూస్తే తెలిసిపోతుంది. ఈ సినిమాలో ఈ ఇద్దరు సీనియర్ ఆర్టిస్టులు హార్ట్ టచింగ్ ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకున్నారు. సినిమాలో అఖిల్ తల్లిదండ్రులుగా జగపతిబాబు, రమ్యకృష్ణ చూపించిన హావభావాలు ధియేటర్లలో కొంతమంది చేత కన్నీళ్లు తెప్పించాయి.

 

రావు రమేష్ (డీజే)

బన్నీ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో మంచి పాత్ర పోషించాడు రావు రమేష్. ఈ సినిమాలో పోషించిన రొయ్యల నాయుడు క్యారెక్టర్ తో తన తండ్రి రావుగోపాలరావును గుర్తుచేశాడు. కెరీర్ లో ఇప్పటికే 50కి పైగా సినిమాలు చేసిన రావురమేష్, రొయ్యల నాయుడు పాత్రను తను పోషించిన బెస్ట్ క్యారెక్టర్ గా చెప్పుకొచ్చాడు

 

సమంత (రాజుగారి గది-2)

హీరోయిన్లకు మంచి పాత్రలు దొరకడం కష్టం. ఎందుకంటే కథ మొత్తం హీరో చుట్టూనే తిరుగుతుంది కాబట్టి. అలాంటిది రాజుగారి గది-2లో నాగార్జున లాంటి హీరోగా ఉన్నప్పటికీ.. అద్భుతమైన పాత్ర పోషించింది సమంత. సినిమా మొత్తానికి సమంత పోషించిన అమృత పాత్రే కీలకం. ఎంబీబీఎస్ స్టూడెంట్ గా, ఆత్మగా.. ఇలా రెండు విభిన్నమైన పాత్రలతో సమంత మెప్పించింది.

శ్రీవిష్ణు (ఉన్నది ఒకటే జిందగీ)

మంచి క్యారెక్టర్ దొరికినప్పుడు అది హీరో వేషమా, విలన్ వేషమా, సైడ్ క్యారెక్టరా అని చూడకూడదు. హీరో శ్రీవిష్ణు కూడా అదే పనిచేశాడు. హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్న టైమ్ లో ఉన్నది ఒకటే జిందగీలో రామ్ ఫ్రెండ్ క్యారెక్టర్ దొరికింది. నిజానికి అది హీరో వేషం కాకపోయినా, హీరోతో సమానంగా సినిమాలో కొనసాగిన రోల్. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా సినిమాలో వాసు పాత్ర పోషించాడు శ్రీవిష్ణు.

 

వెన్నెల కిషోర్ (అమీతుమీ)

కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా అమీతుమీ సినిమాలో ది బెస్ట్ క్యారెక్టర్ పోషించాడు. సినిమాలో అడవి శేషు, అవసరాల శ్రీనివాస్ హీరోలుగా నటించినప్పటికీ.. అందరికీ వెన్నెల కిషోర్ మాత్రమే గుర్తున్నాడంటే, అతడు పోషించిన శ్రీ చిలిపి క్యారెక్టర్ ఎంత క్లిక్ అయిందో అర్థం చేసుకోవచ్చు.