Radheshyam - ఈరోజే ప్రీ రిలీజ్ ఈవెంట్!

Thursday,December 23,2021 - 04:37 by Z_CLU

రెబల్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకునే రోజు రానే వచ్చింది. మరికొద్ది గంటల్లో రాధేశ్యామ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. జీ తెలుగు, జీ సినిమాలు యూట్యూబ్ ఛానెల్స్ లో ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను లైవ్ లో చూసి ఎంజాయ్ చేయండి.

దీనికి సంబంధించి రామోజీ ఫిలింసిటీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక అట్టహాసంగా జరగనుంది.

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ ట్రయిలర్ (Radheshyam Trailer)ను ఇవాళ్టి ఈవెంట్ లో రిలీజ్ చేయబోతున్నారు. హైలెట్ ఏంటంటే.. ఫంక్షన్ కు చీఫ్ గెస్టులు ఎవ్వరూ లేరు. కృష్ణంరాజు నేతృత్వంలో, ప్రభాస్ అభిమానుల చేతుల మీదుగా ఈ ట్రయిలర్ లాంచ్ కాబోతోంది.

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా టీజర్ ఉంది. ఇక సాంగ్స్ అయితే సూపర్ డూపర్ హిట్టయ్యాయి. వీటన్నింటికంటే ముందు రిలీజ్ చేసిన ప్రభాస్, పూజాహెగ్డే ఫస్ట్ లుక్ వీడియోస్ అయితే తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఫైనల్ గా రాధేశ్యామ్ ట్రయిలర్ ను లాంఛ్ చేస్తున్నారు.

రాధేశ్యామ్ కథ ఏంటనేది మేకర్స్ ఇప్పటికే చూచాయగా బయటపెట్టారు. ప్రభాస్ ఇందులో విక్రమాదిత్యగా కనిపించబోతున్నాడు. చేయి చూసి జాతకం కచ్చితంగా చెప్పే వ్యక్తిపాత్ర ఇది. ఇక ప్రేరణగా పూజా హెగ్డే కనిపించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రాబోతోంది రాధేశ్యామ్.