టాలీవుడ్ హిస్టరీలో ఈరోజు

Tuesday,October 30,2018 - 12:58 by Z_CLU

టాలీవుడ్ హిస్టరీలో ఈరోజుకు చాలా ప్రత్యేకత ఉంది. చిరంజీవి, నాగార్జున, వెంకీతో పాటు ఏఎన్నార్, ఎన్టీఆర్ కూడా తమ సినిమాలతో హిట్స్ కొట్టిన రోజు ఈరోజు. ఇంతకీ వీళ్లు నటించిన ఏ సినిమాలు ఈ రోజు రిలీజ్ అయ్యాయి. చెక్ చేద్దాం..

వెంకీ కెరీర్ లో వన్ ఆఫ్ ది మెమొరబుల్ హిట్ ప్రేమంటే ఇదేరా. జయంత్ దర్శకత్వంలో 1998లో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై ఈరోజుకి (అక్టోబర్ 30) సరిగ్గా 20 ఏళ్లు. రమణ గోగుల సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. రమణ గోగులకు ఇదే మొదటి సినిమా

ఈరోజు రిలీజై సూపర్ హిట్ అయిన మరో సినిమా ప్రెసిడెంట్ గారి పెళ్లాం. నాగార్జున, మీన హీరోహీరోయిన్లుగా 1992లో తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ్టికి విడుదలై 26 ఏళ్లు పూర్తిచేసుకుంది. కోదండరామిరెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ డైరక్టర్. ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ హిట్టే

ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన చట్టానికి కళ్లులేవు సినిమా కూడా 37 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు విడుదలైంది. తన కెరీర్ లో చిరంజీవి చేసిన మొట్టమొదటి యాక్షన్ థ్రిల్లర్ ఇది. అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన ఈ సినిమాకు చంద్రశేఖర్ దర్శకుడు. చిరంజీవి కెరీర్ లో ఇది కూడా పెద్ద హిట్.

ఈ సినిమాలతో పాటు ఎన్టీఆర్ నటించిన సర్దార్ పాపారాయుడు (30/10/1980), అక్కినేని నటించిన సిపాయి చిన్నయ్య (30/10/1969) సినిమాలు కూడా ఇదే రోజు విడదలై సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలా టాలీవుడ్ హిస్టరీలో ఈరోజుకు చాలా ప్రత్యేకత ఉంది.