శర్వానంద్ కొత్త సినిమా: టైటిల్ అది కాదు

Thursday,April 25,2019 - 12:40 by Z_CLU

ఈ సినిమాకు ‘పార్థు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారంటూ 2 రోజులుగా గాసిప్స్ వస్తున్నాయి. అయితే అందులో నిజం లేదు. శర్వా సినిమాకు పార్థు అనే టైటిల్ పెట్టలేదని డైరక్టర్ సుధీర్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. ఇంకా టైటిల్ కోసం వెదుకుతున్నట్టు ప్రకటించాడు.

శర్వానంద్, కాజల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ పూర్తయింది. ఇందులో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు శర్వా. సినిమాకు రెండూ కీలకమైనవే. అందుకే ఏ షేడ్ ను దృష్టిలో పెట్టుకొని టైటిల్ ఫిక్స్ చేయాలో యూనిట్ కు అర్థంకావడం లేదు.

క్లాస్ టచ్ ఇచ్చే టైటిల్ కాకుండా, శర్వా డాన్ క్యారెక్టర్ ని దృష్టిలో పెట్టుకొని ఓ పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలని ఆలోచిస్తున్నారట. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది.