మహేష్ హంగామా ఎప్పుడో?

Saturday,January 21,2017 - 11:12 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ప్రెజెంట్ హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. హై ఎండ్ యాక్షన్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో కోలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు సూపర్ స్టార్

అయితే ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్ చేయకపోవడం తో మహేష్ ఫాన్స్ లో కాస్త అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్స్ కొన్ని సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నప్పటికీ యూనిట్ మాత్రం అఫీషియల్ టైటిల్ ను ఇంకా సస్పెన్స్ లోనే పెడుతున్నారు. అసలింతకీ మహేష్ సినిమాకు టైటిల్ అనౌన్స్ చేయడానికి ఇంత లేట్ అవ్వడానికి కారణం ఏమై ఉంటుంది? అనే డౌట్ అందరిలోనూ కలుగుతుంది. ఈ సంక్రాంతి కైనా ఫస్ట్ లుక్ తో మహేష్ హంగామా చేస్తాడనుకున్న ఫాన్స్ కి అది కూడా నిరాశగానే మిగిలింది. మరి మహేష్ ఫస్ట్ లుక్ తో హంగామా చేసేదెప్పుడో?