టైటిల్ ఫిక్స్ చేసుకున్న వైష్ణవ్ తేజ్

Tuesday,May 07,2019 - 04:22 by Z_CLU

మెగా హీరో సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తెరగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమా ఈ నెలలోనే సెట్స్ పైకి రాబోతుంది. కాకినాడ పోర్ట్ లో మొదటి షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. లేటెస్ట్ గా టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. కథకి తగ్గట్టుగా కొన్ని టైటిల్స్ పరిశీలించిన  మేకర్స్ ఫైనల్ గా  ‘ఉప్పెన’ అనే టైటిల్ కి ఫిక్స్ అయ్యారు.

మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్  బ్యానర్స్ పై తెరకెక్కనున్న ఈ సినిమాలో తమిళ్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా కనిపించబోతున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్.