రవితేజ సినిమాకి టైటిల్ ఫిక్స్ !

Wednesday,February 26,2020 - 11:28 by Z_CLU

ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ‘క్రాక్’ సినిమా చేస్తున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఈ సినిమా తర్వాత రమేష్ వర్మతో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాకు ‘కిలాడీ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నారు. త్వరలోనే ఈ టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నారని సమాచారం.

రవితేజ -రమేష్ వర్మ కాంబినేషన్ లో గతంలో ‘వీర’ సినిమా వచ్చింది. ఈ సినిమా కోసం మరో సారి కలవబోతున్నారు. స్టోరీ బేస్డ్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఇందులో రవితేజ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడనే టాక్ వినిపిస్తుంది.