మెగాస్టార్ సినిమాకు టైటిల్ ఫిక్స్ ?

Sunday,November 17,2019 - 01:17 by Z_CLU

కొరటాల దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి తన 152 సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమా డిసెంబర్ నుండి సెట్స్ పైకి వచ్చే చాన్స్ ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది.

అయితే ఈ సినిమాకు లేటెస్ట్ గా టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నారనే వార్త చక్కర్లు కొడుతుంది. ‘గోవిందా హరి గోవిందా’ అనే టైటిల్ ను ఫైనల్ చేసారని అంటున్నారు. దేవాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఈ సినిమా ఉంటుందనే టాక్ నడుస్తుంది. టైటిల్ తో పాటు సినిమా కథాంశంపై కూడా మేకర్స్ రెస్పాండ్ అవ్వట్లేదు. త్వరలోనే ఓ ప్రెస్ మీట్ పెట్టి డిటైల్స్ ఇస్తారనే టాక్ వినబడుతుంది.