చెర్రీ సినిమాకి టైటిల్ ఫిక్స్ ?

Saturday,February 11,2017 - 05:16 by Z_CLU

‘ధృవ’ సక్సెస్ తో జోరు పెంచిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రెజెంట్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా పల్లెటూరి కథతో రూపొందనుండడంతో ఈ సినిమాకు ‘రేపల్లె’ టైటిల్ ను పరిశీలిస్తున్నారట యూనిట్.

ఈ కథకి సంబంధించి పలు టైటిల్స్ ను పరిశీలిస్తున్న యూనిట్ ఫైనల్ గా ఈ విల్లేజ్ ఎంటర్టైనర్ కి ‘రేపల్లె’ టైటిల్ ను ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తుంది. టైటిల్ నుంచి సినిమా ఎండ్ కార్డు వరకూ ప్రతీ విషయంపై స్పెషల్ కేర్ తీసుకునే సుకుమార్.. ఈ సినిమాను కూడా తన డిఫరెంట్ మేకింగ్ స్టైల్ లోనే ఓ డిఫరెంట్ మూవీ గా తెరకెక్కించబోతున్నాడు. మరి ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన సుక్కు ఈ టైటిల్ నే ఖరారు చేస్తాడా… చూడాలి….