పవన్ - త్రివిక్రమ్ సినిమాకు టైటిల్ ఫిక్స్ ?

Tuesday,October 03,2017 - 04:50 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు యూనిట్.. అయితే ప్రస్తుతం అందుతున్న అప్ డేట్స్ మేరకూ ఈ సినిమాకు ‘అజ్ఞాత వాసి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం వార్తగానే ఉన్న ఈ టైటిల్ ను త్వరలోనే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం.

ఇటీవలే బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకొని బ్రేక్ తీసుకున్న యూనిట్ త్వరలోనే యూరప్ లో భారీ షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సీన్స్ ను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తో టోటల్ గా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారు మేకర్స్.

హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్ , అను ఇమ్మానుయేల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.