పవన్ - నితిన్ సినిమాకు టైటిల్ ఫిక్స్ ?

Sunday,July 16,2017 - 04:02 by Z_CLU

లేటెస్ట్ గా ‘అ ఆ’ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నితిన్ ప్రెజెంట్ హను రాఘవ పూడి డైరెక్షన్ లో ‘లై’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజి కి తీసుకొచ్చిన నితిన్ త్వరలోనే కృష్ణ చైతన్య డైరెక్షన్ లో నటించే సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమాకు ‘అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి’ అనే టైటిల్ ఆప్ట్ అని భావిస్తున్న యూనిట్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా టైటిల్ కూడా గుర్తుచేసేలా ఉండటంతో ఈ టైటిల్ నే ఫిక్స్ చేయబోతున్నారని సమాచారం. ఇప్పటికే యూనిట్ ఈ విషయం పై ఓ నిర్ణయానికొచ్చేశారని పవన్ కూడా ఈ టైటిల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని టాక్.


త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ మూవీస్ బ్యానర్స్ పై పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్-సుధాకర్ రెడ్డి నిర్మించనున్నారు.