నితిన్ సినిమాకు టైటిల్ ఫిక్స్ !

Thursday,February 20,2020 - 03:23 by Z_CLU

విభిన్న కథాంశంతో సినిమాలు తెరకెక్కించే చంద్ర శేఖర్ ఏలేటి డైరెక్షన్ లో నితిన్ నటిస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసారు. క్రైం థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొన్నటి వరకూ ‘చదరంగం’ అనే టైటిల్ పెట్టబోతున్నారనే వార్త చక్కర్లు కొట్టింది. కానీ సినిమాకు ‘చదరంగం’ టైటిల్ కాకుండా ‘చెక్’ అనే టైటిల్ పెట్టుకున్నారు మేకర్స్.

చదరంగంలో ‘చెక్’ ను టైటిల్ గా పెట్టుకొని త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ లాయార్ గా నటిస్తుంది. ప్రియా వారియర్ మరో కథానాయికగా కనిపించనుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది.