మహేష్, కొరటాల సినిమాకి టైటిల్ ఫిక్స్

Wednesday,March 15,2017 - 08:10 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్, కొరటాలశివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకు లేటెస్ట్ గా టైటిల్ ఫిక్స్ చేసేశారు మేకర్స్.. ఇప్పటికే ఈ సినిమాకు ‘భరత్ అనే నేను’ టైటిల్ పెట్టనున్నారనే వార్త సోషల్ మీడియా లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే..

అయితే ఈ సినిమాకు ఇప్పుడు అదే టైటిల్ ని ఫిక్స్ చేసారని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిటింగ్స్ పాల్గొంటున్న దేవి శ్రీ ప్రసాద్ కొరటాలతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి మహేష్ సార్ ‘భరత్ అనే నేను’ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నా అంటూ తెలిపాడు.. సో ఫైనల్ గా మహేష్ సినిమాకు ఈ టైటిల్ నే ఫిక్స్ చేశారన్నమాట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా మే నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.