మహేష్ సినిమా టైటిల్ పై క్లారిటీ....

Monday,February 20,2017 - 02:17 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ హీరోగా మురుగదాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ పై ఎట్టకేలకి క్లారీటి వచ్చేసింది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచి ఇప్పటి వరకూ టైటిల్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ మెయింటెన్ చేస్తున్నారు యూనిట్. అయితే ఇప్పటికే ‘ఏజెంట్ శివ’,’సంభవామి యుగే యుగే’ అనే టైటిల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నప్పటికీ టీం మాత్రం ఇంకా ఈ సినిమా టైటిల్ పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వకుండా జగ్రత్త పడుతూ ఫస్ట్ లుక్ పై క్యూరాసిటీ బిల్డ్ చేస్తున్నారు..

ఇక మహేష్ అభిమానుల్లో టైటిల్ పై కొనసాగుతున్న డౌట్స్ కి లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చాడు ప్రముఖ నిర్మాత పి.విపి. ఇటీవలే సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు గెస్ట్ గా హాజరైన పివిపి  నిర్మాత ఠాగూర్ మధు గారు ఈ ఏడాది ‘విన్నర్’, ‘మిస్టర్’,’సంభవామి యుగే యుగే’ వంటి మూడు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోబోతున్నారు అని చెప్పడంతో మహేష్ సినిమాలో ఠాగూర్ మధు కూడా ఓ నిర్మతగా వ్యవహరిస్తుండడం, పైగా సోషల్ మీడియాలో ఇప్పటికే మహేష్ సినిమా టైటిల్స్ లో ‘సంభవామి యుగే యుగే’ అనే టైటిల్ కూడా వినిపిస్తుండడంతో మహేష్  అభిమానుల్లో సినిమా టైటిల్ పై క్లారిటీ వచ్చేసింది. మరి ఈ టైటిల్ పై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేదెప్పుడో చూడాలి…