అఖిల్ సినిమాకు టైటిల్ ఫిక్స్ ?

Wednesday,March 15,2017 - 11:00 by Z_CLU

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఎట్టకేలకి తన నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మించనున్న ఈ సినిమా ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేశారనే వార్త చక్కర్లు కొడుతోంది.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘జున్ను’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. సినిమాలో అఖిల్ పాత్ర పేరు జున్ను అట. అంతా అఖిల్ ను జున్ను అనే పిలుస్తారట. అందుకే సినిమాకు అదే టైటిల్ పెట్టారని తెలుస్తోంది.

డిఫరెంట్ గా టైటిల్స్ పెట్టడంలో విక్రమ్ కుమార్ స్పెషలిస్ట్. మనం, 24 లాాంటి టైటిల్స్ విక్రమ్ కుమార్ వే. అఖిల్ సినిమాకు కూడా, కథకు తగ్గట్టు కొత్తగా ఉంటుందని జున్ను అనే టైటిల్ ఫిక్స్ చేశారట. త్వరలోనే ఈ టైటిల్ పై ఓ క్లారిటీ రానుంది.