అరవింద సమేత టీజర్ కు టైమ్ ఫిక్స్

Monday,August 13,2018 - 11:06 by Z_CLU

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో మోస్ట్ ఎవెయిటింగ్ మూవీగా, క్రేజీ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న అరవింద సమేత టీజర్ తో ముస్తాబైంది. ఈ సినిమా టీజర్ ను ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా టైమ్ కూడా ఫిక్స్ చేశారు. పంద్రాగస్ట్ కానుకగా ఆగస్ట్ 15 ఉదయం 9 గంటలకు అరవింద సమేత టీజర్ విడుదలవుతుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో ఇదే తొలి సినిమా. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు ఎన్టీఆర్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా టీజర్ ఎనౌన్స్ మెంట్ లో భాగంగా రిలీజ్ చేసిన ఓ స్టిల్, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అక్టోబర్ లో అరవింద సమేత సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.