మెగా హీరో మరో హిట్టు కొడతాడా?

Thursday,August 11,2016 - 10:53 by Z_CLU

వరుస విజయాలతో దూసుకుపోతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రేక్షకులను అలరించడానికి మరో సినిమాతో సిద్ధం అయ్యాడు.. ఇటీవలే ‘సుప్రీమ్’ తో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకున్న ఈ యువ హీరో ఈ శనివారం ‘తిక్క’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి కనబరుస్తున్నారు టీం. బ్రేకప్ చుట్టూ తిరిగే ఈ కథ లో కామెడీ మేజర్ హైలైట్ అని ఆ కామెడీ తోనే కథ ముందుకు సాగుతుందని సాయి ధరమ్ తేజ్ తన నటన, డాన్సులతో మరో సారి విపరీతంగా అలరిస్తాడని తేజ్ కు మరో సూపర్ హిట్ కన్ఫర్మ్ అని ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నారు యూనిట్. మరి ‘రేయ్’ మినహా నటించిన సినిమాలన్ని విజయాలు అందుకోవడం తో ఈ మెగా హీరో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి తేజ్ ‘తిక్క’ తో ఎలాంటి విజయం అందుకుంటాడా? తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.