సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి..

Sunday,July 01,2018 - 01:28 by Z_CLU

జయం రవి కథానాయకుడిగా శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండియాస్ ఫస్ట్ స్పేస్ థ్రిల్లర్ “టిక్ టిక్ టిక్”. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చదలవాడ పద్మావతి నిర్మాణ సారథ్యంలో తెలుగులో డబ్బింగ్ చేశారు.

తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని అంటున్నారు నిర్మాతలు. తమిళనాట జయంరవి కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన “టిక్ టిక్ టిక్” తెలుగులోనూ మంచి వసూళ్లు రాబడుతోందట.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చదలవాడ లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేసారు. పెద్దలతోపాటు పిల్లలు కూడా మా చిత్రాన్ని ఆదరిస్తుండడం చాలా సంతోషంగా ఉందని, ఉహించినదాని కంటే భారీ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయని అన్నారు.