“A” మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్

Thursday,May 21,2020 - 02:42 by Z_CLU

యుగంధర్ ముని దర్శకత్వం వహించిన సినిమా “A”(AD INFINITUM). ఈ సినిమా మోషన్ పోస్టర్ ను జగపతిబాబు విడుదల చేశారు. మొదటి నుంచి ఈ చిత్ర బృందం విడుదల చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులలో ఎంతో ఆశక్తిని పెంచుతూ వచ్చాయి, ఇప్పుడు విడుదల చేసిన మోషన్ పోస్టర్ కూడా ప్రేక్షకులలో ఎక్స్ ఫర్టేషన్ ను మరింత పెంచేలా వుంది.

ఫిల్మ్ స్కూల్ నేపథ్యం నుండి వచ్చిన దర్శకుడు తన జట్టును కూడా అదే తరహాలో ఎన్నుకున్నాడు. కెమెరామెన్ ప్రవీణ్ కె బంగారి (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ డిజైన్ బినిల్ అమక్కాడు (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ మిక్సింగ్ సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డు విన్నర్), ఆనంద్ పవన్ & మణికందన్ ఎడిటింగ్ (ఎఫ్‌టిఐఐ) ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. చిత్రంలోని అన్ని పాటలను అనంత శ్రీరామ్ రాయగా… విజయ్ కూరాకుల సంగీతం అందించాడు.

తన తొలి చిత్రంలోనే హీరో నితిన్ ప్రసన్న 3 విభిన్నమైన పాత్రలు పోషించే సవాలును స్వీకరించాడు. మళ్ళీరావా, ప్రెషర్ కుక్కర్ లలో పక్కింటి అమ్మాయిగా కనిపించిన హీరోయిన్ ప్రీతి అశ్రాని ఈ సినిమాలో పూర్తిగా భిన్నమైన పాత్రను పోషించింది..