నాని హీరోయిన్లు.. ముగ్గురు ఫిక్స్?

Tuesday,February 05,2019 - 11:08 by Z_CLU

త్వరలోనే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నాని. ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. వీళ్లలో ముగ్గురు భామల్ని ఇప్పటికే ఫిక్స్ చేశారట.

 అవును.. నాని-విక్రమ్ కుమార్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కీర్తిసురేష్ ను సెలక్ట్ చేశారట. మరో ఇద్దరు హీరోయిన్లుగా మేఘా ఆకాష్, ప్రియా వారియర్ ను ఎంపిక చేశారు. మరో ఇద్దరి కోసం సెర్చింగ్ షురూ చేశారు.

 ఈ నెలలోనే సెట్స్ పైకి రాబోతోంది నాని-విక్రమ్ కుమార్ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమా కంప్లీట్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.