శర్వా చేతిలో మూడు సినిమాలు

Sunday,July 14,2019 - 04:00 by Z_CLU

త్వరలోనే ‘రణరంగం’ సినిమాతో థియేటర్స్ లో ఎంట్రీ ఇస్తున్న శర్వానంద్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. నెక్స్ట్  ’96’ తెలుగు రీమేక్ లో నటించబోతున్నాడు శర్వా . ఈ సినిమాతో పాటే ‘శ్రీకారం’ అనే సినిమాను కూడా ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. ‘శ్రీకారం’ సినిమా ఇటివలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఈ రెండు సినిమాల తర్వాత ఎస్.ఆర్. ప్రభు నిర్మాణంలో తెరకెక్కనున్న బై లింగ్వెల్ సినిమా చేస్తాడు.’రణరంగం’ తర్వాత ఇలా వరుసగా మూడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్ చేయాలని ఫిక్సయ్యాడు శర్వా. మరి ఈ మూడు సినిమాలు తనకి ఏ రేంజ్ హిట్స్ అందిస్తాయో చూడాలి.