తొలిప్రేమ 4 రోజుల వసూళ్లు

Wednesday,February 14,2018 - 01:06 by Z_CLU

వరుణ్ తేజ్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తొలిప్రేమ సినిమాకు శివరాత్రి బాగా కలిసొచ్చింది. ఈ సినిమాకు ప్రతి ఏరియా నుంచి రికార్డు వసూళ్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా నైజాం నుంచి సింగిల్ డే లో కోటి రూపాయల షేర్ రావడం విశేషం. అటు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ కు దగ్గరవుతున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఈ 4 రోజుల్లో 10 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 26 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.

ఏపీ, నైజాం 4 రోజుల వసూళ్లు

నైజాం – రూ. 4.08 కోట్లు
సీడెడ్ – రూ. 1.22 కోటి
నెల్లూరు – రూ. 0.34 కోట్లు
గుంటూరు – రూ. 0.94 కోట్లు
కృష్ణా – రూ. 0.90 కోట్లు
వెస్ట్ – రూ. 0.73 కోట్లు
ఈస్ట్ – రూ. 0.90 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.53 కోట్లు

4 రోజుల మొత్తం షేర్ – రూ. 10.64 కోట్లు