తొలిప్రేమ మొదటి రోజు వసూళ్లు

Sunday,February 11,2018 - 11:42 by Z_CLU

ఫిదా తర్వాత మరో సూపర్ హిట్ అందుకున్నాడు వరుణ్ తేజ్. వెంకీ అట్లూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ హీరో చేసిన తొలిప్రేమ సినిమా యూనానిమస్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. టాక్ సంగతి పక్కనపెడితే.. ఫిదా ఎఫెక్ట్ ఈ సినిమాపై బాగానే పడిందనే విషయం మొదటి రోజు వసూళ్లు చూస్తే అర్థమౌతుంది. ఏపీ, నైజాం, ఓవర్సీస్ తేడాలేకుండా అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకు అదిరిపోయే వసూళ్లు వచ్చాయి

ఏపీ, నైజాం ఫస్ట్ డే కలెక్షన్ (షేర్)

నైజాం – రూ. 1.20 కోట్లు
సీడెడ్ – రూ. 0.35 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.45 కోట్లు
గుంటూరు – రూ. 0.38 కోట్లు
ఈస్ట్ – రూ. 0.24 కోట్లు
వెస్ట్ – రూ. 0.25 కోట్లు
కృష్ణా – రూ. 0.24 కోట్లు
నెల్లూరు – రూ. 0.12 కోట్లు

ఫస్ట్ డే టోటల్ షేర్ – రూ. 3.23 కోట్లు