ఈ వీకెండ్ ఎట్రాక్షన్స్

Wednesday,September 07,2016 - 04:00 by Z_CLU

 

ప్రతివారం మార్కెట్లోకి కొత్త సినిమాలు వస్తుంటాయి. వీటిలో కొన్ని సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటాయి. మరికొన్ని మాత్రం మెల్లగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ఇంకొన్ని మాత్రం థియేటర్లలోకి ఎప్పుడొస్తాయా అని ప్రేక్షకులు ఆశగా ఎదురుచూసేలా చేస్తాయి. ఈ వీకెండ్ కూడా కొన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఆ మూవీస్ ఏంటో ఓ లుక్కేద్దాం..

inkokkadu movie

విక్రమ్ నటించిన తాజా చిత్రం ఇంకొక్కడు. ప్రీవియస్ మూవీ “ఐ “తో అంతగా అలరించలేకపోయిన విక్రమ్.. ఈసారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలనే కసితో ఉన్నాడు. అందుకే ఇంకొక్కడు పేరుతో మరో ప్రయోగాన్ని తెరపైకి తెచ్చాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు… నయన్ గ్లామర్ డోస్ కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కానుంది.

Jyo-Achyutananda-Movie-

ఇంకొక్కడు సినిమా విడుదలైన 24 గంటల గ్యాప్ లో థియేటర్లలోకి రాబోతోంది జ్యో అచ్యుతానంద మూవీ. ఈ సినిమా కూడా ట్రయిలర్ తో బాగానే ఆకట్టుకుంది. అవసరాల శ్రీనివాస్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో నారా రోహిత్, నాగశౌర్య హీరోలుగా నటించారు. ఇద్దరూ కాస్త డిఫరెంట్ గా కనిపించడంతో పాటు ఒకే అమ్మాయిని లైన్లో పెట్టడం కోసం ప్రయత్నించడం సినిమాకు హైలెట్. రెజీనా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. గతంలో అవసరాల తీసిన ఊహలు గుసగుసలాడే సినిమా హిట్టవ్వడం కూడా తాజా చిత్రంపై బజ్ ను పెంచేలా చేసింది.

mental_

 

ఇక శ్రీకాంత్ నటించిన మెంటల్ సినిమా కూడా సెప్టెంబర్ 9నే విడుదలకాబోతోంది. టైటిల్ తో వివాదం సృష్టించి నలుగురి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి. తెలుగులో సందడి చేయబోతున్న ఈ సినిమాలతో పాటు శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది బార్ బార్ దేఖో సినిమా. కత్రినాకైఫ్, సిద్దార్థ్ మల్హోత్రా పెయిర్ గా నటించిన ఈ సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. వీళ్లిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. అందుకే బార్ బార్ దేఖో మూవీ… బాలీవుడ్ లో మోస్ట్ ఎవెయిటింగ్ ప్రాజెక్టు అయింది.

0h92pgvi7eptuoox.D.0.Baar-Baar-Dekho-Movie-featuring-Katrina-Kaif--Sidharth-Malhotra