ఈ ఇద్దరికి సక్సెస్ చాలా ఇంపార్టెంట్ !

Tuesday,November 09,2021 - 05:04 by Z_CLU

This Two films success are very important for Karthikeya , Anand Deverakonda

ఏ హీరోకయినా ప్రతీ సినిమా ఒక పెద్ద టాస్కే. రిలీజ్ కి ముందు అయితే టెన్షన్ మరోలా ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు ఇలాంటి ఫేజ్ లో ఉన్నారు యంగ్ హీరోలు కార్తికేయ , ఆనంద్ దేవరకొండ. ఈ వారం ఈ  ఇద్దరూ హీరోగా  నటించిన సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి.

కార్తికేయ కొత్త దర్శకుడితో చేసిన ‘రాజా విక్రమార్క’ నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సరిగ్గా అదే రోజు ఆనంద్ దేవరకొండ నటించిన ‘పుష్పక విమానం’ సినిమా రిలీజవుతోంది. నిజానికి ఈ రెండు సినిమాల విజయం ఇటు కార్తికేయ కి అటు ఆనంద్ దేవరకొండ ఇద్దరికీ చాలా ముఖ్యం.

‘ఆర్ ఎక్స్ 100’ తర్వాత కార్తికేయకి సరైన హిట్ పడలేదు. విలన్ గా మారి చేసిన సినిమా కూడా ఆడలేదు. దీంతో ఇప్పుడు తన ఆశలన్నీ ‘రాజా విక్రమార్క‘ మీదే పెట్టుకున్నాడు. టీజర్ , ట్రైలర్ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు క్రియేట్ చేశాయి. కార్తికేయ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇదే నెలలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. పెళ్లికి ముందు సూపర్ హిట్ కొట్టి తన భార్య కి సక్సెస్ ని గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాడు.

ఇక ఆనంద్ దేవరకొండ కి ‘పుష్పక విమానం‘ సక్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. హీరోగా లాంచ్ అయిన మొదటి సినిమా థియేటర్స్ పెద్దగా ఆడలేదు. తర్వాత చేసిన రెండో సినిమా మిడిల్ క్లాస్ మేలోడీస్ OTT లో బాగానే చూశారు. కానీ ఆనంద్ కి థియేటర్ హిట్ అనేది లేదు. ఈ సినిమాతో ఆ వెలితి పోతుందని నమ్మకంగా ఉన్నాడు. పైగా సొంత బేనర్ సినిమా కావడంతో ఎలాగైనా మంచి వసూళ్ళు రాబట్టి అన్నయ్య కి లాభాలు తేవాలని భావిస్తున్నాడు. ట్రైలర్ కూడా క్లిక్ అవ్వడంతో సినిమాపై బజ్ ఉంది. పైగా ఆనంద్ స్టోరీ సెలెక్షన్ బాగుంటుంది అనే టాక్ తెచ్చుకున్నాడు కూడా.

మరి ఈ యంగ్ హీరోలు ఈ రెండు సినిమాలతో ఎలాంటి హిట్స్ అందుకుంటారో..? బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తారో ? వేచి చూడాల్సిందే.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics