మళ్లీ చెబుతున్నా.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ

Monday,December 11,2017 - 10:43 by Z_CLU

“నాగచైతన్య నటించిన రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్ లో వస్తున్నాం, కొడుతున్నాం అన్నాం. చెప్పినట్టుగానే కొట్టాం. ఆ సినిమా తర్వాత అఖిల్ సినిమా పనిలోనే ఉన్నాం. డిసెంబర్ 22న మీ ముందుకొస్తున్నాం. 3 రోజుల కిందటే సినిమా చూశాను. వస్తున్నాం.. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. ఇది ఫిక్స్.” హలో ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో నాగార్జున చెప్పిన మాటలివి.

విశాఖలోని ఎంజీఎం గ్రౌండ్స్ లో ఈ సినిమా ఆడియో రిలీజ్ గ్రాండ్ గా జరిగింది. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన పాటల్ని ఒక్కొక్కటిగా గ్రాండ్ గా విడుదల చేశారు. ఫంక్షన్ లో మాట్లాడిన నాగార్జున సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నామని ప్రకటించాడు. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్నాడు.

“అఖిల్ కు రీలాంచ్ అన్నాను. చెప్పినట్టుగానే అఖిల్ ను రీలాంఛ్ చేస్తున్నాను. అఖిల్ ను ఎలా చూడాలని నేను మనసులో అనుకున్నానో అదే హలో సినిమా. నేనే కాదు, మీరంతా ఎలా చూడాలనుకున్నారో అలా చూస్తారు.” హలో సినిమాపై నాగ్ రియాక్షన్ ఇది.

ఈనెల 22న ప్రవంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది హలో సినిమా. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడు ప్రియదర్శన కూతురు కల్యాణి హీరోయిన్ గా పరిచయమౌతోంది.