ఫస్ట్ లుక్ అప్పుడే...?

Monday,October 03,2016 - 05:17 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ దర్శకత్వం లో నటిస్తున్న తాజా చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవలే చెన్నై లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన యూనిట్ ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది.

మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మహేష్ లుక్ ఎలా ఉండబోతుందా అనే ఆతృతలో ఉన్నారు సూపర్ స్టార్ ఫాన్స్.

mahesh-murugadoss

సినిమా షూటింగ్ ప్రారంభంలోనే మహేష్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ కోసం రెండు రోజులు షూట్ చేశారనే టాక్ వినిపించింది. అయితే అది వార్తగానే మిగిలింది. తాజా సమాచారం ప్రకారం మహేష్ నటిస్తున్న ఈ చిత్ర టీజర్ ను దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ వార్త నిజమైతే మాత్రం మహేష్ అభిమానులకు దీపావళి పెద్ద పండగే..