MAA Elections - బరిలో ఐదుగురు

Monday,June 28,2021 - 10:14 by Z_CLU

ఏకగ్రీవం చేద్దామనుకున్న ప్రతిసారి పోటీ పెరుగుతోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా మారబోతున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈసారి ఏకంగా ఐదుగురు అధ్యక్ష పదవికి పోటీపడడం సంచలనంగా మారింది.

గతంల MAA Elections ఎప్పుడు జరిగినా అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఏకగ్రీవం జరిగేది. ఆ తర్వాత 2 గ్రూపులు పోటీపడేవి. ఇప్పుడు ఏకంగా 5 గ్రూపులు అయ్యాయి. ఇక బరిలో నిలిచిన వ్యక్తులెవరో చూద్దాం.

prakash-raj-maa-nagababu

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఈసారి అందరికంటే ముందుగా బరిలో నిలిచిన వ్యక్తి ప్రకాష్ రాజ్. ఈయన అప్పుడే తన ప్యానెల్ ను కూడా ప్రకటించారు. మెగా కాంపౌండ్ నుంచి నాగబాబు మద్దతు కూడా ఈయనకు లభించింది. అంటే పరోక్షంగా కాంపౌండ్ సపోర్ట్ మొత్తం ప్రకాష్ రాజ్ కు ఉన్నట్టే.

manchu vishnu mohan babu krishna

ఇక ప్రకాష్ రాజ్ కు పోటీగా మంచు విష్ణు రంగంలోకి దిగారు. యువకుడు, ఉత్సాహవంతుడైన విష్ణును మనందరం గెలిపించుకోవాలంటూ సీనియర్ నరేష్ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. అటు విష్ణు కూడా తండ్రి మోహన్ బాబుతో కలిసి కృష్ణ, కృష్ణంరాజు లాంటి సినీపెద్దల్ని కలిసే కార్యక్రమం మొదలుపెట్టారు.

hema jeevitha

వీళ్లతోపాటు ఈసారి బరిలో హేమ, జీవిత కూడా దిగారు. అధ్యక్ష పదవి ప్రతిసారి పురుషుడికే దక్కుతోందని, ఈసారి మహిళ గెలవాల్సిన అవసరం, ఆవశ్యకత ఉన్నాయంటూ వీళ్లిద్దరూ రంగంలోకి దూకారు. అందరి మద్దతు తమకుందని చెబుతున్నారు. ఇప్పుడీ పోటీలోకి తాజాగా సీవీఎల్ నరసింహారావు వచ్చి చేరారు. ఈయన ఏకంగా తెలంగాణ, ఏపీ ప్రాతిపదికన అసోసియేషన్ ను 2 విభాగాలు చేయమంటున్నారు.

ఇలా ఈసారి MAA Elections రసవత్తరంగా మారాయి. 900కు పైగా సభ్యులున్న మా అసోసియేషన్ కు సెప్టెంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics