ఈ నెలంతా సమంత సందడి

Monday,October 09,2017 - 11:23 by Z_CLU

స్టార్ హీరోయిన్ సమంత ఈ నెలంతా సందడి చేయబోతోంది. అటు పెళ్లితో పాటు సినిమాలతో హల్ చల్ చేస్తోంది ఈ బ్యూటీ. నాగచైతన్యను పెళ్లాడి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సమంత.. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో కూడా ఎట్రాక్ట్ చేయబోతోంది. ఆమె నటించిన రాజుగారి గది-2, అదిరింది సినిమాలు ఈనెల్లోనే థియేటర్లలోకి రాబోతున్నాయి.

మామగారు నాగార్జునతో కలిసి సమంత నటించిన చిత్రం రాజుగారి గది-2. హారర్-కామెడీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా తనకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని ఆశిస్తోంది సమంత. ఎందుకంటే.. ఇప్పటివరకు తన కెరీర్ లో చేయని పాత్రను పోషించింది. ఇందులో ఆత్మగా కనిపించనుంది సమంత.

రాజుగారి గది-2 అక్టోబర్ 13న థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా వచ్చిన 5 రోజులకు 18వ తేదీన ఆమె నటించిన మరో సినిమా కూడా రాబోతోంది. ఆ సినిమా పేరు అదిరింది. తమిళ్ లో విజయ్ హీరోగా నటించిన మెర్సెల్ సినిమాకు డబ్బింగ్ వెర్షన్ ఇది. సో… ఈ నెలంతా టాలీవుడ్ లో సమంత మేనియానే కొనసాగనుంది.