రవితేజ డిస్కోరాజా నుండి మూడో సాంగ్ రిలీజ్

Friday,January 17,2020 - 01:24 by Z_CLU

మాస్ మహారాజ ర‌వితేజ… ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల ఫేం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న డిస్కో రాజా సినిమాని రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. నభా నటేశ్, పాయల్‌, తాన్యా హోప్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలోని మూడో పాటను తాజాగా రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు విఐ. ఆనంద్ మాట్లాడుతూ….
డిస్కో రాజా అనే సినిమా ఆడియన్స్ కొత్త అనుభూతిని ఇస్తుంది. రవితేజ క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. తమన్ అందించిన సాంగ్స్ ఈ మధ్య పాపులర్ అయ్యాయి, అలాగే మా సినిమా కోసం తమన్ మరో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చాడు. రమ్ పమ్ బమ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది అన్నారు.

తమన్ మాట్లాడుతూ….
రమ్ పమ్ బమ్ సాంగ్ చేస్తున్నప్పుడు ఛాలెంజింగ్ గా తీసుకున్నాను, ఇప్పుడు సాంగ్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, గుడ్ రెస్పాన్స్ లభిస్తోంది, ఇదంతా చూస్తుంటే కష్టం మర్చిపోయాను. డిస్కో రాజా సినిమాకు మంచి పాటలు చేసే అవకాశం లభించింది. ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన ఢిల్లీవాలా, నువ్వు నాతో సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించిందన్నారు.

జనవరి 24న డిస్కోరాజా మూవీ థియేటర్లలోకి వస్తోంది.