Lucifer Remake - హీరోయిన్ లేదు

Wednesday,November 25,2020 - 04:06 by Z_CLU

చిరంజీవి అప్ కమింగ్ ప్రాజెక్టుల్లో Lucifer Remake కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది. ఇందులో చిరంజీవికి హీరోయిన్ అంటూ ఎవ్వరూ ఉండరు.

నిజానికి లూసిఫర్ లో హీరో మోహన్ లాల్ కు హీరోయిన్ ఉండదు. కానీ రీమేక్ లో మాత్రం చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టు కథను కాస్త మార్చి హీరోయిన్ ను సెట్ చేయాలని అనుకున్నారు. కానీ ఒరిజినల్ వెర్షన్ కు మార్పుచేర్పులు చేయకుండానే రీమేక్ చేయాలని చిరంజీవి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

ముందుగా ఈ ప్రాజెక్టును సుజీత్ హ్యాండిల్ చేశాడు. కానీ అతడు చేసిన ఛేంజెస్ చిరంజీవికి నచ్చలేదట. తర్వాత వినాయక్ చెప్పిన ట్రాక్ కూడా Chiranjeevi కి నచ్చలేదు. ఇప్పుడీ ప్రాజెక్టు జయం రాజా చేతికి వెళ్లినట్టు టాక్.

రీమేక్స్ తీయడంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు జయం రాజా. ఎన్నో తెలుగు, తమిళ సినిమాల్ని రీమేక్స్ చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు లూసిఫర్ రీమేక్ ను కూడా ఇతడే హ్యాండిల్ చేస్తాడనే ప్రచారం నడుస్తోంది. ఒరిజినల్ వెర్షన్ ను మార్చకుండా తీయడమే బెటరని సలహా ఇచ్చింది కూడా ఇతడేనట.

 

Also Check చిరు కొత్త లుక్ అదుర్స్