మా ఇద్దరి మధ్య గొడవల్లేవ్

Friday,March 16,2018 - 06:03 by Z_CLU

ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటుంది ప్రభాస్ సాహో సినిమా. పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. దానికి తోడు ఈ సినిమా డైరెక్టర్ సుజిత్, ప్రభాస్ మధ్య గొడవల కారణంగా సినిమా ఆలస్యమయ్యే చాన్సెస్ ఉన్నాయన్న రకరకాల గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్.

సుజిత్ సినిమా డైరెక్షన్ చేస్తున్న విధానం ప్రభాస్ కి నచ్చకపోవడంతో ఈ ఇద్దరి మధ్య విబేధాలొచ్చాయన్న న్యూస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ లో చిన్న సైజు డిస్టబెన్స్ క్రియేట్ అయింది. అయితే ఈ రూమర్స్ ని కొట్టి పడేసిన ప్రభాస్, సుజిత్ కి తనకు మధ్య గొడవల్లేవని, సినిమా షూటింగ్ పక్కా ప్లాన్డ్ షెడ్యూల్స్ ప్రకారం నడుస్తుందని చెప్పుకున్నాడు.

స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా UV క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.