Theaters Re-Open: రేపట్నుంచి సినిమా సందడి

Thursday,December 03,2020 - 03:24 by Z_CLU

లాంగ్ గ్యాప్ తర్వాత రేపట్నుంచి తెలంగాణలో థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో రేపట్నుంచి సినిమా సందడి షురూ కాబోతోంది. ఈ మేరకు అన్ని మల్టీప్లెక్సుల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శానిటైజేషన్, సీటింగ్ మార్కింగ్, అందరికీ స్క్రీనింగ్ టెస్ట్, పీపీఈ కిట్స్,
మూవీ టైమింగ్స్.. ఇలా అన్నీ సెట్ చేసి పెట్టుకున్నారు.

tenet_telugu_release_hyderabad

రేపు హైదరాబాద్ లో అన్ని మల్టీప్లెక్సులు తెరుచుకోనున్నాయి. అత్యథిక స్క్రీన్స్ టెనెట్ అనే హాలీవుడ్ మూవీకి కేటాయించారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తగ్గట్టే ఆన్ లైన్ లో బుకింగ్స్ జోరు కనిపిస్తోంది. ప్రసాద్స్ ఐమ్యాక్స్, ఏఎంబీ మాల్స్ లో ఇప్పటికే 90శాతం టిక్కెట్లు అమ్ముడుపోవడం ఆశ్చర్యం. మిగతా మల్టీప్లెక్సుల్లో కూడా బుకింగ్ జోరుగా సాగుతోంది.

the_new_mutants_telugu_hyderabad

టెనెట్ తో పాటు పెనెన్సులా, ది న్యూ మ్యూటెంట్స్, కమ్ ప్లే, ట్రోల్స్ లాంటి సినిమాలు రేపట్నుంచి థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అయితే రేపు సింగిల్ స్క్రీన్స్ ఏవీ
తెరుచుకోవడం లేదు.

హాలీవుడ్ మూవీస్ తో పాటు తెలుగు నుంచి అర్జున్ రెడ్డి, కనులు కనులను దోచాయంటే లాంటి సినిమాలు రేపట్నుంచి థియేటర్లలో మళ్లీ రిలీజ్ అవ్వబోతున్నాయి. వచ్చే శుక్రవారం (డిసెంబర్ 11) నుంచి సినిమా సందడ మరింత ఊపందుకునే ఛాన్స్ ఉంది.