18 Pages "నన్నయ్య రాసిన" లిరికల్ వీడియో

Tuesday,November 22,2022 - 05:32 by Z_CLU

The soothing melody “Nannaya Raasina” from Nikhil’s 18 Pages is Out Now

నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddharth) , అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా తెరకెక్కిన “18 పేజిస్” (18 Pages) నుండి ఫస్ట్ సింగిల్ రిలీజైంది. తాజాగా  “నన్నయ్య రాసిన” అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. గోపి సుందర్ కంపోజ్ చేసిన ఈ పాటకు  శ్రీమణి లిరిక్స్ అందించాడు.

ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పెలైన తెలిపేనా
ఏ నడకది ఏ పయనమో ఏ పాదమైన చూపేనా
నీలో స్వరాలకే నేనే సంగీతమై
నువ్వే వదిలేసిన పాటై సాగేనా
నన్నయ్య రాసిన కావ్యమగితే, తిక్కన తీర్చేనుగా
రాధమ్మ ఆపిన పాట మధురిమా కృష్ణుడు పాడెనుగా…

అంటూ శ్రీమణి రచించిన లైన్స్ మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తున్నాయి. పృథ్వి చంద్ర, సితార కృష్ణ కుమార్ ఈ సాంగ్ పాడారు. ఈ సాంగ్ విన్నవెంటనే అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఖచ్చితంగా ఈ పాట మంచి మెలోడీ హిట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్ కథ అందించారు. కుమారి 21 ఎఫ్ చిత్రంతో హిట్ అందుకున్న పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో  బన్నీ వాసు నిర్మిస్తున్నారు.  ఇదివరకే రిలీజైన టీజర్ సినిమాపై  అంచనాలను పెంచేసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా విడుదల కానుంది.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics