మమ్ముట్టీ బెస్ట్ ... రీజన్ అదే

Wednesday,January 30,2019 - 11:06 by Z_CLU

యాత్ర సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే వై.ఎస్.ఆర్ గా పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు మమ్ముట్టీ. ఫిబ్రవరి 8న విడుదలవుతోన్న ఈ సినిమాలో  వై.ఎస్. గా మమ్ముట్టీ గారిని సంప్రదించడంపై లేటెస్ట్ గా మాట్లాడాడు దర్శకుడు మహి వి రాఘవ్. ” ఈ సినిమాలో వై.ఎస్.ఆర్ గా మీరు చేస్తే బాగుంటుంది అని నేను ఆయనని అడగ్గానే  ఆయన నన్ను ఒకే ఒక ప్రశ్న వేశారు.

‘నేనే ఎందుకు..?’ అని… దానికి నేనిచ్చిన సమాధానం ‘దళపతి’ సినిమా” అంటూ చెప్పుకొచ్చాడు మహి. దళపతి సినిమాలోని ఒక సీన్ లో రజినీకాంత్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ అగ్రెసివ్ గా డైలాగ్స్ చెప్పాక, చివరిలో మమ్ముట్టి గారు జస్ట్ ‘కుదరదు’అంటారు. ఆ ఒక్కమాట ఆ సీన్ ని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టింది. అలా జరిగిందంటే కేవలం అది ఆయన ఆరా. సాధారణ నటుల వల్ల అది పాసిబుల్ కాదు. అందుకే ఆయనే ఈ క్యారెక్టర్ కి బెస్ట్ అనిపించింది. నేను కథ చెప్పగానే  వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ సినిమా చేసారు.” అని తెలిపాడు.