మహర్షి అంచనాలు ఎన్నో – కారణాలు 5

Thursday,March 28,2019 - 02:53 by Z_CLU

రేపటి నుండి మహర్షి మ్యూజికల్ జర్నీ బిగిన్ అవుతుంది. ఈ సినిమా చుట్టూ ఆల్రెడీ  క్రియేట్ అయి ఉన్న వైబ్స్ కి మరింత ఊపునివ్వబోతుంది ఫస్ట్ సింగిల్. అయితే ఏడాదికో సినిమా చొప్పున ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నా, ఈ ‘మహర్షి’ మాత్రం ఎందుకంత స్పెషల్ గా ట్రీట్ చేయబడుతుంది…? అసలీ సినిమా చుట్టూ ఇన్నేసి అంచనాలెందుకు క్రియేట్ ఎందుకవుతున్నాయి. ప్రస్తుతానికి కారణాలు 5 ఉన్నాయి.

 

 

వంశీ పైడిపల్లి  : మహేష్ బాబుకు కొంచెం ఖాళీ దొరికిందంటే ఫ్యామిలీతో హాలీడే లో ఉంటాడు… లేకపోతే కథలు వింటుంటాడు. వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ కి కథ చెప్పినప్పుడు కూడా అప్పటికే ఓకె అనిపించుకున్న డైరెక్టర్స్ ఉన్నా, వంశీ పైడిపల్లికి మైల్ స్టోన్ మూవీ రెస్పాన్సిబిలిటీ అప్పగించాడు. ఎందుకలా..? ‘ఊపిరి’ తరవాత మూడేళ్ళ గ్యాప్ తీసుకుని మరీ ఈ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. ఆ స్థాయిలో మెస్మరైజ్ అయ్యేలా వంశీ ఏం చెప్పి ఉంటాడు…?

 

హై వోల్టేజ్ పాయింట్ : రైతుల సమస్యల బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటే అది చాలా కామన్ పాయింటే. కానీ ఆ రైతులకు సంబంధించి ఏ పాయింట్ ఈ ‘మహర్షి’ లో హైలెట్ కానుంది. డెఫ్ఫినెట్ గా రెగ్యులర్ పాయింట్ కాదని ఫ్యాన్స్ స్ట్రాంగ్ ఫీలింగ్. ఫ్రెండ్స్ తో సరదాగా గడిపేస్తూ ఫన్ లవింగ్ కుర్రాడిలా ఉండే ‘రిషి’ ని మహర్షిలా మార్చే ఆ హై వోల్టేజ్ పాయింట్ ఏంటి..?

 

అల్లరి నరేష్ : రిలీజైన స్టిల్స్, టీజర్ ని బట్టి కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి అని తెలుస్తుంది. మేకర్స్ ఇంతగా ఈ ఎపిసోడ్ పైనే కాన్సంట్రేషన్ మళ్లిస్తున్నారంటే డెఫ్ఫినెట్ గా దానికి రిలేటెడ్ గా సెకండాఫ్ ఉండబోతుంది. ఏది ఏమైనా వీటిమధ్య కీ రోల్ ప్లే చేసేది మాత్రం అల్లరి నరేష్. రైతుల సమస్యలు అనేది కాస్త పక్కన  పెట్టినా, సినిమాలో ఫ్రెండ్ షిప్ బేస్డ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండబోతున్నాయనే వైబ్స్ కనిపిస్తున్నాయి.

మహేష్ బాబు – DSP కాంబో : ఈ ఇద్దరి కాంబోలో ఇది 5 వ సినిమా. DSP గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమైతే లేదు కానీ, ఈ కాంబో గురించి మాత్రం కంపల్సరీగా మెన్షన్ చేయాలి. మహేష్ బాబు సినిమాకి పనిచేసినప్పుడల్లా, DSP మ్యూజిక్ కాదు మ్యాజిక్ జెనెరేట్ చేస్తాడు అనే టాక్ ఉంది. ఈసారి కూడా ఆ మాట నెగ్గడం గ్యారంటీ అనే వైబ్స్ ఉన్నాయి.

 

పూజా హెగ్డే – డెఫ్ఫినెట్ గా మ్యాటర్స్. పూజ హెగ్డే ఫిల్మోగ్రఫీ గమనిస్తే క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ లేకపోతే సినిమా చేసిన దాఖలాలు కనిపించవు. మహేష్ బాబు , పూజా హెగ్డే కెమిస్ట్రీ దగ్గరి నుండి ఈ కాంబోపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో క్యూరియాసిటీ క్రియేట్ అయి ఉంది. సినిమా మహేష్ బాబుదే కానీ ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ మాత్రం పూజా హెగ్డే పై కూడా నిలుస్తుంది.