జీ సినీ అవార్డ్స్‌ తెలుగు 2020.... మీ జీ తెలుగులో

Saturday,January 25,2020 - 11:02 by Z_CLU

తెలుగు సినీ ఇండస్ట్రీ అతిరథ మహారథుల సమక్షంలో

అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా సాగిన జీ తెలుగు  జీ సినీ అవార్డ్స్‌ 2020

తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో అద్భుతమైన సీరియల్స్‌, అదిరిపోయే రియాలిటీ షోస్‌.. అంతకుమించిన సూపర్‌డూపర్‌ హిట్‌ సినిమాలతో అప్రతిహతంగా దూసుకుపోతోంది జీ తెలుగు. ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకుల్ని రంజింపచేస్తున్న జీ తెలుగు, జీ సినీ అవార్డ్స్‌ 2020 కార్యక్రమాన్ని కన్నుల పండుగగా, కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలుగు ఇండస్ట్రీ స్టార్‌ హీరోలు, హీరోయిన్లు హాజరై.. ఈవెంట్‌ని కలర్‌ఫుల్‌గా మార్చేశారు. నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అద్భుతమైన డ్యాన్స్‌లకు వేదికగా మారిన జీ సినీ అవార్డ్స్‌ 2020 కార్యక్రమం ఈ శనివారం మరియు ఆదివారం జనవరి 25, 26 తేదీల్లో సాయంత్రం 6 గంటల నుంచి  జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ చానెల్స్‌లో ప్రసారం కానుంది.

అన్ని అవార్డ్స్‌ ఫంక్షన్స్‌ ఒకేలా ఉండవనడానికి జీ తెలుగు అద్భుతమైన రీతిలో నిర్వహించిన జీ సినీ అవార్డ్స్‌ 2020 కార్యక్రమమే మంచి ఉదాహరణ. తెలుగు ఇండస్ట్రీ అతిరథ మహారథులంతా ఈ అవార్డ్స్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. మెగాస్టార్‌ చిరంజీవి ఈ ఈవెంట్‌కే ప్రధాన ఆకర్షణ.

అవార్డుల కార్యక్రమం అయినా, మరేదైనా.. పెద్దల్ని గౌరవించుకోవడం మన సంప్రదాయం. ఆ సంప్రదాయానికి అగ్రతాంబూలం ఇస్తూ.. జీ తెలుగు జీ సినీ అవార్డ్స్‌ 2020 కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కే.విశ్వనాథ్‌ని లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఇక సైరా సినిమాలో అద్భుతమైన నటనకుగాను  మెగాస్టార్‌ చిరంజీవి ఉత్తమ నటుడు అవార్డుని అందుకున్నారు. ఓ బేబీ, మజిలి సినిమాల్లో నటనకు సమంత ఉత్తమ నటి అవార్డుని సొంతం చేసుకుంది. ఇక ట్విట్టర్‌ స్టార్‌ అవార్డ్‌ని సొంతం చేసుకున్నారు సూపర్‌స్టార్‌ మహేశ్‌. 2019లో ఎక్కువ ట్వీట్లు చేసిన టాలీవుడ్‌ స్టార్‌ సూపర్‌స్టార్‌ మహేషే మరి.

జీ తెలుగు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ సినీ అవార్డ్స్‌ 2020 కార్యక్రమాన్ని అస్సలు మిస్ కాకండి. జనవరి 25 మరియు 26, 2020 శనివారం, ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి.. మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డి చానెల్స్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా.