మొట్ట మొదట గుర్తించింది ప్రభాసే...!!

Friday,June 14,2019 - 10:06 by Z_CLU

సుజిత్… ఎవరో ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ‘సాహో’ టైటిల్ చాలు… ‘బాహుబలి’ లాంటి సినిమా తరవాత ప్రభాస్ సినిమా బాధ్యతలు తీసుకోవడం అన్నది చిన్న విషయం కాదు… అది అక్షరాలా పాసిబుల్ అయిందంటే అంటే దానికి కారణం వన్ అండ్ ఓన్లీ ప్రభాస్… ‘సాహో’ సినిమా పాసిబుల్ అయినందుకు కాదు.. సుజిత్ లాంటి దర్శకుడు తెలుగు సినిమాకి పరిచయం అయినందుకు…

‘రన్ రాజా రన్’ సినిమాకి ముందు సుజిత్ కూడా సాధారణంగా దర్శకుడై పోదామని స్ట్రగుల్ అయిన కుర్రాడే. అందరిలా యూ ట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తీసుకున్న వాడే. కానీ జరిగిన మిరాకిల్ ఏంటంటే అందులో ఓ షార్ట్ ఫిల్మ్ ప్రభాస్ చూడటం… నచ్చినట్టుంది… అందుకే సరదాగా కలవడానికి రమ్మని కబురు పంపాడు. ఆ మూమెంట్ సుజిత్ డెస్టినీ మార్చేసింది.

ఆ మీటింగ్ ని ముందుగానే ఎక్స్ పెక్ట్ చేసి ఉండకపోయినా చేతిలో  స్క్రిప్ట్ రెడీగా ఉండటం సుజిత్ కి మరింత కలిసొచ్చింది… కథ వినీ వినగానే ఇమ్మీడియట్ గా శర్వాతో సినిమాకి రిఫర్ చేశాడు ప్రభాస్. కట్ చేస్తే UV క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా ‘రన్ రాజా రన్’…  

ఈ సినిమా సక్సెస్ తరవాత ప్రభాస్ సుజిత్ స్టామినాని కరెక్ట్ గా గెస్ చేశాడు అనుకున్నారంతా.. కానీ సుజిత్ లో ప్రభాస్ ఏం గుర్తించాడన్నది ‘సాహో’ టీజర్ రిలీజైతే కానీ తెలీలేదు… ఈ కుర్రాడికి ఇంత సీనుందా..? అని ప్రపంచం ఈ రోజు అనుకుంటుంది.. కానీ సుజిత్ ఇది చేయగలడు అని నాలుగేళ్ళ క్రితమే ప్రభాస్ నమ్మాడు…

హాలీవుడ్ స్థాయి సినిమా అన్న పదం టాలీవుడ్ లో కొత్త కాదు… కానీ ‘సాహో’ టైటిల్ తో పాటు ‘బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్… ఫ్రమ్ ఇండియా..’ అనడం మేకర్స్ కాన్ఫిడెన్స్ ని ఎలివేట్ చేస్తుంది. ఈ సినిమా జస్ట్ ఇండియన్ ఆడియెన్స్ కి కాదు.. వరల్డ్ ఆడియెన్స్ కి అని ప్రమోట్ చేస్తుంది… ఏది ఏమైనా ఈ క్రెడిట్ మాత్రం ప్రభాస్ కే.