రకుల్ కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్

Tuesday,May 30,2017 - 11:49 by Z_CLU

రకుల్ ప్రీత్.. టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ. టాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన చాలా తక్కువ టైమ్ లోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తారాజువ్వలా దూసుకొచ్చింది రకుల్. అలా తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో పాత్రలు పోషించింది. అయితే ఇప్పటివరకు ఆమె ప్లే చేసిన ది బెస్ట్ క్యారెక్టర్ మాత్రం భ్రమరాంబ.

అవును.. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా రకుల్ కోసమే పుట్టిందేమో అనిపిస్తుంది. ఈ మూవీలో భ్రమరాంబగా అందరితో శభాష్ అనిపించుకుంది ఈ బ్యూటీ. పర్ ఫెక్ట్ ఎక్స్ ప్రెషన్స్, అద్భుతమైన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో భ్రమరాంబగా నిలిచిపోయింది.

రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో ఎన్నో ఎట్రాక్షన్ ఉన్నాయి. అదిరిపోయే స్టోరీలైన్ ఉంది. చైతూ లాంటి స్టార్ ఉన్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. అన్నపూర్ణ స్టుడియోస్ లాంటి పెద్ద బ్యానర్ ఉంది. వీటితో పాటు భ్రమరాంబ పాత్ర మరో మెయిన్ హైలెట్ గా నిలిచింది సినిమాకు.

అందుకే ఇప్పటికే కాదు, ఎప్పటికీ తన కెరీర్ లో భ్రమరాంబ పాత్ర స్ఫెషల్ గా నిలిచిపోతుందని సంబరంగా చెబుతోంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం రారండోయ్ వేడుక చూద్దాం సినిమా సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో సక్సెస్ పుల్ గా రన్ అవుతోంది.