నా డ్రీం ప్రాజెక్ట్ అదే

Sunday,April 02,2017 - 02:04 by Z_CLU

టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన డ్రీం ప్రాజెక్ట్ పై సోషల్ మీడియా ద్వారా నోరువిప్పాడు. రోగ్ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఫాన్స్ తో ముచ్చటించిన పూరి ‘జనగణమన’ తన డ్రీం ప్రాజెక్ట్ అని ఆ సినిమా కచ్చితంగా చేస్తానని అయితే అడిగి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మాత్రం చెప్పలేనని తెలిపాడు.

ఇప్పటికే మహేష్ హీరోగా ‘జనగణమన’ టైటిల్ కూడా అనౌన్స్ చేసేసిన పూరి ఆ సినిమాను త్వరలోనే సెట్స్ పై పెట్టాలని చూస్తున్నాడు. మరి ప్రెజెంట్ కొరటాల శివ, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్ తో వరుసగా మూడు సినిమాలు ప్లాన్ చేసుకున్న మహేష్ ఈ సినిమా కోసం పూరి కి డేట్స్ ఇచ్చేదెప్పుడో.. పూరి డ్రీం ప్రాజెక్ట్ సెట్స్ పైకెళ్లేదెప్పుడో..