బాలీవుడ్ కి రామ్ చరణ్ సినిమా

Thursday,July 06,2017 - 12:30 by Z_CLU

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘థని ఒరువన్’ తెలుగులో, రామ్ చరణ్ హీరోగా ‘ధృవ’ గా తెరకెక్కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ రీమేక్ కి రెడీ అవుతుంది. హిందీలో షాబిర్ ఖాన్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఆల్ రెడీ ప్రీ ప్రొడక్షన్ బిగిన్ అయిపోయింది.

తమిళంలో జయం రవి హీరోగా, అరవింద్ స్వామి స్టైలిష్ విలన్ గా నటించాడు. అయితే హిందీలో అర్జున్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రాని కన్సిడర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. స్లిక్ అండ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాలేదు.

 

హిందీలో వరసగా ‘హీరోపంతి’, ‘బాగి’, ‘మున్నా మైకేల్’ లాంటి సినిమాల తరవాత పూర్తి బాలీవుడ్ స్టైల్ లో, ఈ సినిమాని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఒక పోలీసాఫీసర్ కి ఇంటెలిజెంట్ సైంటిస్ట్ కి మధ్య జరిగే ఇంటరెస్టింగ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ లోను అదే రేంజ్ సక్సెస్ సాధిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.