Ramcharan Shankar Movie - మ్యూజిక్ డైరెక్టర్ కి వెల్కం చెప్పిన టీం

Tuesday,July 20,2021 - 01:55 by Z_CLU

శంకర్ , రామ్ చరణ్ కాంబినేషన్ సినిమా ఎనౌన్స్ అయిన వెంటనే ఈ సినిమాకు మ్యూజిక్ ఎవరు అనే చర్చ మొదలైంది. ఆ సమయంలో కొందరు పేర్లు కూడా వినిపించాయి. ముఖ్యంగా అనిరుద్ పేరు ఎక్కువగా వినిపించింది. అయితే ఈ ప్రశ్నలకు తాజాగా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. #RC15 సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటూ ప్రకటించి తమన్ కి వెల్కం చెప్పారు.

అంతే కాదు మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అంటూ తమన్ తో కలిసి రామ్ చరణ్ , శంకర్ , నిర్మాత శిరీష్ కలిసి ఉన్న ఓ ఫోటో కూడా రిలీజ్ చేశారు. దీంతో #RC15 కి తమన్ మ్యూజిక్ అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. రామ్ చరణ్ ‘నాయక్’ , ‘బ్రూస్ లీ’ సినిమాలకు మ్యూజిక్ అందించాడు తమన్. మళ్ళీ ఇన్నేళ్ళకి రామ్ చరణ్ సినిమాకు మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు.

thaman shankar ramcharan

అలాగే శంకర్ సినిమాకు తమన్ మ్యూజిక్ ఇవ్వడం ఇదే మొదటి సారి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి రెహ్మాన్ ని కాకుండా శంకర్ తమన్ ని తీసుకోవడం హాట్ టాపిక్ అవుతుంది. ఇక శంకర్ డైరెక్షన్ లో కొన్నేళ్ళ క్రితం తెరకెక్కిన ‘బాయ్స్’ సినిమాలో నటించాడు తమన్. మళ్ళీ ఇన్నేళ్ళకి శంకర్ సినిమాతో కొలబ్రేట్ అవుతున్నాడు. కాకపోతే ఈసారి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నాడు తమన్. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి తమన్ ఎలాంటి ఆల్బం అందిస్తాడో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics