మళ్లీ కలిసిన మేజిక్ కాంబినేషన్

Thursday,February 13,2020 - 03:06 by Z_CLU

సామజవరగమన.. ఈ పాట సృష్టించిన సంచలనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టాలీవుడ్ లో అదొక చరిత్ర. అంతటి హిస్టరీని క్రియేట్ చేసిన కాంబో మళ్లీ కలుస్తోంది. అవును.. తమన్-సిద్ శ్రీరామ్ కలిసి మరోసారి వర్క్ చేయబోతున్నారు.

 ప్రస్తుతం పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు పవన్ కల్యాణ్. దిల్ రాజు బ్యానర్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వకీల్ సాబ్ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమా కోసమే తమన్, సిద్ శ్రీరామ్ మరోసారి కలిశారు.

 అల వైకుంఠపురములో సినిమాకు సామజవరగమన అనే ఒకే ఒక్క పాటతో ఊపొచ్చింది. సినిమాకు హైప్ తీసుకురావడంలో ఆ పాట ఎంతో ప్లస్ అయింది. ఇప్పుడు మరోసారి అలాంటి మేజిక్ ను పవన్ కోసం రిపీట్ చేయాలని అనుకుంటున్నాడు తమన్.