Vakeelsaab 126 సినిమాల వెయిటింగ్

Monday,April 05,2021 - 06:06 by Z_CLU

పవన్ కళ్యాణ్ గారితో ఇలాంటి గొప్ప సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు గారికి థాంక్స్. ఇది 126 సినిమాల వెయిటింగ్, 20 ఏళ్లు వేచి చూసిన కల. నాకు వకీల్ సాబ్ రెండున్నర గంటల సినిమా సరిపోలేదు మ్యూజిక్ చేసేందుకు. ఇంకా కోరిక అలాగే ఉంది. నా రాత మార్చిన వ్యక్తి త్రివిక్రమ్ గారు. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కూడా నాకే ఇప్పించారు. అందులో మాస్ పాటలు చేస్తానని మాటిస్తున్నా. మా అమ్మను తీసుకెళ్లి గర్వంగా చూపించే సినిమా వకీల్ సాబ్. పవన్ గారి మీద నాకున్న అభిమానాన్ని మాటల్లో చెప్పలేను. ఆ ప్రేమ, కసి, ఎమోషన్ అంతా  కీబోర్డ్ మీద చూపిస్తాను. నేను నా టీమ్ అంతా గత 36 రోజులుగా సరిగ్గా నిద్రపోకుండా పనిచేస్తున్నాము. ఏప్రిల్ 9న మీరంతా సినిమా చూడాలనేది నా కోరిక.” అంటూ వకీల్ సాబ్ మ్యూజికల్ ఎక్స్ పీరియన్స్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో షేర్ చేసుకున్నాడు మ్యూజికల్ సెన్సేషన్ థమన్.