థమన్ కి ఇదే ఫస్ట్ టైం !

Wednesday,November 17,2021 - 04:58 by Z_CLU

Thaman opens up on ‘Tuck Jagadish’ Issue

నాని తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎందుకు వద్దన్నాడు ?

భీమ్లా నాయక్’ సాంగ్స్ తమన్ ఎంత టైంలో కంపోజ్ చేశాడు ?

తమన్ ఎక్కువ టైం తీసుకొని కంపోజ్ చేసిన సాంగ్ ఏది ?

ప్రెజెంట్ తమన్ రీ వర్క్ చేస్తున్న సినిమా ఏంటి ?

ఈ ప్రశ్నలన్నిటికీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు మ్యూజిక్ సెన్సేషన్ థమన్.

“..’టక్ జగదీష్‘ కి హార్ట్ పెట్టి బ్యాక్ స్కోర్ ఇచ్చాను. కానీ నానికి అది నచ్చలేదు. వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించుకున్నారు. నా కెరీర్ లో ఇలా జరగడం ఇదే మొదటి సారి. ఈ విషయమై కాస్త బాధ పడ్డాను. కానీ నానితో మళ్ళీ ఇదంతా మర్చిపోయి వర్క్ చేస్తాను. అవన్నీ పట్టించుకోను.”

“..’భీమ్లా నాయక్  నా కెరీర్ లో చాలా తక్కువ టైంలో కంపోజ్ చేసిన ఆల్బం. టైటిల్ పెట్టిన రెండ్రోజులకే టైటిల్ సాంగ్ అయిపోయింది. మరో ఐదు రోజుల్లోనే నాలుగు పాటలు పూర్తయ్యాయి. ఎక్కువ శాతం సెట్ లోనే వర్క్ చేశాను. క్యార్ వాన్ లోనే సాంగ్స్ ఫినిష్ చేసేశాను. మొగిలయ్య గారిని పవన్ కళ్యాణ్ గారే సజిస్ట్ చేశారు. ఆయన త్రివిక్రమ్ గారికి చెప్పడం వెంటనే ఆయన నాతో షేర్ చేసుకోవడం ఫాస్ట్ గా జరిగిపోయాయి. ఆ పాటతో ఈ వయసులో ఆయనకి ఇంత గుర్తింపు రావడం చాలా సంతోషం. ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుంది. ఆయనకి రికార్డింగ్ కి డెబ్బై వేల రూపాయిలు ఇచ్చాం. పవన్ కళ్యాణ్ గారు కూడా పర్సనల్ గా మళ్ళీ ఎమౌంట్ అందించారు.”

“..’అల వైకుంఠ పురములో’ సినిమాకు గానూ టైటిల్ సాంగ్ చేయడానికి చాలా టైం తీసుకున్నాను, మిగతా వాటికి ధీటుగా ఉండాలని అలాగే కథను తెలిపే థీం సాంగ్ అవ్వడంతో ఎక్కువ టైం పట్టింది.

బాలకృష్ణ గారితో ‘అఖండ‘ సినిమా చేస్తున్నను. దానికి వర్క్ అంతా అయిపోయింది. నా వర్క్ కి డైరెక్టర్ కూడా సాటిస్ఫై అయ్యారు. కానీ మేమే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద మళ్ళీ రీ వర్క్ చేస్తున్నాం. అది చాలా గొప్ప సినిమా అవుతుందని నా నమ్మకం.

ఇలా కొన్ని విషయాల గురించి స్పందిస్తూ వాటికి సమాధానం అందించాడు తమన్. ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న థమన్ ఎప్పటికప్పుడు తన సాంగ్స్ తో ట్రెండింగ్ లో కొనసాగుతున్నాడు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics