Thaman మెగా డ్రీం నెరవేరనుంది !

Wednesday,January 20,2021 - 01:16 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవితో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతీ టెక్నీషియన్ కి ఉంటుంది. ఇప్పుడు Thaman కూడా ఆ డ్రీం నేరవేర్చుకోబోతున్నాడు. మెగాస్టార్ నెక్స్ట్ సినిమా ‘లూసిఫర్’ రీమేక్ కి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసి మెగా స్టార్ తో సినిమా చేయాలనే తన కోరిక ఎట్టకేలకు నెరవేరిందని తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు. ఇప్పుడు తన మ్యూజిక్ తో మెగా స్టార్ పై తనకున్న ప్రేమను చూపించుకుంటానని ఫ్యాన్స్ కి తెలియజేశాడు.

అల వైకుంఠపురములో ఆల్బం పెద్ద హిట్ అవ్వడంతో తమన్ కి భారీ ఆఫర్స్ వరుసపెట్టి వస్తున్నాయి. కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలతో పాటు భారీ సినిమాలకు కూడా మ్యూజిక్ ఇస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు తమన్. మరి పవన్ కళ్యాణ్ కి ‘వకీల్ సాబ్’ తో ‘మగువ’ లాంటి మంచి మెలోడీ సాంగ్ అందించిన తమన్ చిరు సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి.