Balakrishna Thaman - మరోసారి బాలయ్య మూవీకి తమన్ సంగీతం

Sunday,August 14,2022 - 12:31 by Z_CLU

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, డబుల్ బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి తొలిసారిగా జతకడుతున్న క్రేజీ కాంబినేషన్ కు సర్వం సిద్ధమైయింది. #NBK108 వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని బాలకృష్ణ పుట్టినరోజున అధికారికంగా ప్రకటించారు. ఈరోజు చిత్ర నిర్మాతలు, సంగీత దర్శకులకు సంబధించిన ప్రకటన వచ్చింది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి స్టార్ సెన్సేషనల్ కంపోజర్ ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో బాలకృష్ణ, అనిల్ రావిపూడి , ఎస్ థమన్ కాంబినేషన్ ఖచ్చితంగా చరిత్ర సృష్టించడం ఖాయం.

అనిల్ రావిపూడి, థమన్ కలసిపని చేయడం ఇదే తొలిసారి. కాగా, బాలకృష్ణ సెన్సేషనల్ హిట్ అఖండకు థమన్ బ్లాక్ బస్టర్ సంగీతాన్ని అందించారు. ఈ సందర్భంగా “త్వరలో బాంబార్డింగ్…” అంటూ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభానికి సంబంధించి అనౌన్స్ మెంట్ వీడియో ని విడుదల చేశారు మేకర్స్. అనౌన్స్ మెంట్ వీడియోకి తమన్ ఇచ్చిన బిజీయం మ్యూజిక్ బ్రిలియంట్ గా వుంది. అనౌన్స్ మెంట్ బిజీఎంనే అదిరిపోయిందంటే.. సినిమాలో ఏ స్థాయిలో వుంటుందనే ఎక్సయిట్మెంట్ ప్రేక్షకుల్లో కలిగించారు.

మాస్‌ పల్స్‌ తెలిసిన అనిల్‌ రావిపూడి బాలకృష్ణ కోసం విభిన్నమైన, మాస్‌ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. నటసింహ నందమూరి బాలకృష్ణని మునుపెన్నడూచూడని పాత్రలో చూపించబోతున్నారు.

ఇందులో ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తుంది. #NBK 108 కోసం అత్యున్నత సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నారు.

anil ravipudi balakrishna zeecinemalu