బాలీవుడ్ కు తమన్

Tuesday,May 16,2017 - 04:52 by Z_CLU

సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ త్వరలోనే బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికే చాలా సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన తమన్.. త్వరలోనే ఓ హిందీ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఆ విషయాన్ని తమన్ స్వయంగా ప్రకటించాడు.

బాలీవుడ్ దర్శకుడు రోహిత్ షెట్టి సినిమాకు తమన్ ట్యూన్స్ ఇస్తాడు. అది కూడా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన గోల్ మాల్ ఫ్రాంచైజీకి మ్యూజిక్ అందించబోతున్నాడు. నిజంగా ఇది సెన్సేషనల్ న్యూసే. ఎందుకంటే సౌత్ నుంచి అతికొద్ది మంది సంగీత దర్శకులకి మాత్రమే బాలీవుడ్ ఛాన్స్ దక్కుతుంది. అలాంటి గోల్డెన్ ఛాన్స్ ను తమన్ అందుకున్నాడు.

ప్రస్తుతం గోల్ మాల్ రిటర్న్స్ అనే సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు రోహిష్ షెట్టి. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత గోల్ మాల్ -4 సెట్స్ పైకి వస్తుంది. అజయ్ దేవగన్ ఈ సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు.