తమన్ ఇంటర్వ్యూ

Thursday,November 16,2017 - 10:07 by Z_CLU

ఇంప్రెసివ్ మ్యూజిక్ తో… సక్సెస్ ఫుల్ సినిమాలతో… కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు థమన్. నవంబర్ 16, 1983 లో జన్మించిన థమన్ ఈ రోజు తన 34 వ పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ…

అందుకే స్పీడ్ తగ్గించా…

గతంతో పోలిస్తే కొంచెం స్పీడ్ తగ్గిన మాట వాస్తవమే. డిఫెరెంట్ సినిమాలు చేయడమే దానికి రీజన్. ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ చాలా బాగా చేస్తున్నారు. అలాంటప్పుడు మోస్ట్ డిఫెరెంట్ అనిపించుకుంటే  కానీ, సాంగ్ కి గుర్తింపు రాదు.

‘జవాన్’ సినిమాలో పాటలు…

ఇప్పటికే 3 సాంగ్స్ రిలీజయ్యాయి. మంచి రెస్పాన్స్ వస్తుంది. రేపు రిలీజ్ కాబోయే ‘అవునన్నా కాదన్నా’ సాంగ్ సినిమాలో స్పెషల్ సాంగ్. శ్రియా ఘోషల్ పాడిన ఈ సాంగ్ నా బర్త్ డే కి లాంచ్ అవుతున్నందుకు చాలా హ్యాప్పీ…

సినిమా సక్సెస్ కోసమే ఏం చేసినా…

గ్రాండ్ గా ఆడియో రిలీజ్ అయితే హ్యాప్పీ గా ఉంటుంది. కాకపోతే సినిమాల  ప్రమోషన్  ప్రాసెస్ మారిపోయింది. ఆడియో రిలీజ్  ప్లేస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ రావడం, సాంగ్స్ ఒకేసారి కాకుండా ఒక్కో సాంగ్ రిలీజ్ చేయడంతో సాంగ్స్ కి మంచి గుర్తింపు వస్తుంది. సో… నాకు తెలిసి ఈ మార్పు కూడా మంచికే..

ప్రతి హీరో స్టారే…

స్టార్ హీరోతో చేసినా చిన్న హీరోతో చేసినా పెద్దగా తేడా ఉండదు. మన ఇండస్ట్రీ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మన సినిమాలో హీరో చిన్నవాడైనా, పెద్దవాడైనా ప్రొడ్యూసర్స్ దగ్గర నుండి మ్యూజిక్ కంపోజర్స్ వరకు తనను స్టార్ లాగే ట్రీట్ చేస్తారు.

లైఫ్ లో మెమోరబుల్ మూమెంట్

రాఘవేంద్ర రావుగారు ‘అన్నమయ్య’ సినిమా చేస్తున్నప్పుడు గుడిలో గంట సౌండ్ కావాల్సి వచ్చింది, అప్పటికే 2, 3 రకాల  సౌండ్స్  విన్నారు కానీ ఆయనకేవీ నచ్చలేదు, అంతలో నేను చేసింది వినిపించాను, అంతే ఓకె అనేశారు, అది నా లైఫ్ లో మెమోరబుల్ మూమెంట్…

ఇంత తక్కువ టైమ్ లో ఇన్ని సినిమాలు…

నాకు మ్యూజిక్ తప్ప ఇంకో ప్రపంచం తెలీదు, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు, అస్తమానం మ్యూజిక్కే పనిగా పెట్టుకుంటా.. దానికి తోడు డైరెక్టర్స్, హీరోల సపోర్ట్ ఉంది..  అందుకే ఇంత ఫాస్ట్ గా ఇన్ని సినిమాలు పాసిబుల్ అయ్యాయనుకుంటున్నా…

ఒక్కోసారి ట్యూన్స్ రిపీట్ అవుతుంటాయి..

ఒక్కోసారి సినిమాల్లో నా ట్యూన్స్ రిపీట్ అయ్యాయి… కాకపోతే అది నిజంగా బిగినింగ్ లోనే నోటీస్ చేసి ఉంటే, అప్పటికప్పుడే డెసిషన్ తీసుకునేవాణ్ణేమో.. కానీ ఇక అలా జరగదు.. ఇప్పుడు చాలా కేరింగ్ గా జాగ్రత్తగా ఉంటున్నా…

సాయి ధరమ్ తేజ్ కి నాకు ఉన్న అనుబంధం…

సాయి ధరమ్ తేజ్ నేను ఒక కడుపున పుట్టలేదు కానీ, అంతకన్నా ఎక్కువగా ఉంటాం… ఇద్దరం కలిసి ఇంకా గట్టిగా సక్సెస్ టేస్ట్ చూడలేదు కానీ, తేజ్ విషయంలో ఆల్ వేస్ బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తా… జవాన్ సినిమాతో పాటు, వినాయక్ గారి సినిమా, ఇంకా తేజ్ అకౌంట్ లో ఉన్న మరో రెండు సినిమాలకు నేనే మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నా.. ఈ సారి ఇద్దరం కలిసి సక్సెస్ కొడతాం గ్యారంటీగా…

లవ్ స్టోరీస్ పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నా…

నా కరియర్ లో లవ్ స్టోరీస్ కి సాంగ్స్ కంపోజ్ చేసింది చాలా తక్కువే. కానీ ఇప్పుడు మెలోడీస్ పై ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నా.. అందుకే లవ్ స్టోరీస్ అయితే బెటర్ అనుకుంటున్నా…

అదే ఈ మధ్య చేసిన ప్రయోగం…

మహానుభావుడు కుస్తీ ఫైట్ సిచ్యువేషన్ లో డ్రమ్స్ పై స్యాండ్ వేసి కొట్టాం.. రాజు గారి గది 2 లోనూ కొత్తగా ట్రై చేశాం.. రెండింటికి చాలా మంచి అప్లాజ్ వచ్చింది…

బాలీవుడ్ ప్రాజెక్ట్స్…

రీసెంట్ గా గోల్ మాల్ చేశాను, ఇప్పుడు హిందీ టెంపర్ కి చేస్తున్నాను…

ఫ్యాన్సే ఇండస్ట్రీకి బ్లడ్…

ఏ ఇండస్ట్రీ తో పోల్చుకున్నా టాలీవుడ్ ఇండస్ట్రీ బెస్ట్… అది ఇంత బెస్ట్ అనిపించుకోవడానికి రీజన్  ఫ్యాన్స్.  నిజంగా సినిమాల సక్సెస్ కి ఫ్యాన్సే రీజన్. పైరసీని టాలీవుడ్ లో ఈ రేంజ్ లో అణచగలుగుతున్నామంటే దానికి రీజన్ ఫ్యాన్స్.

ఇప్పట్లో రాసే ఆలోచన లేదు

ప్రస్తుతానికి కంపోజిషన్ ఒకటే… పాటలు రాసే ఆలోచన ఇప్పట్లో లేదు. మన ఇండస్ట్రీలో చాలా గొప్ప లిరిసిస్ట్ లు ఉన్నారు. అంత గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు మనం రాయాల్సిన అవసరం లేదు అని నా ఫీలింగ్…